Header Banner

నాపై దాడి చేసిన వారిని వదిలేది లేదు.. దీని వెనుక ఎంతటి వారున్నా వదిలేది లేదని వ్యాఖ్యలు!

  Sat Apr 26, 2025 20:02        Politics

చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ తనపై రెండు నెలల క్రితం జరిగిన దాడి ఘటనపై తీవ్రంగా స్పందించారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. దాడి ఘటన వివరాలను రంగరాజన్ వివరిస్తూ, "ఫిబ్రవరి 7వ తేదీన కొందరు వ్యక్తులు మా ఇంటికి వచ్చి తలుపులు తట్టారు. అప్పుడు నేను స్నానం చేయనందున టీషర్టులో ఉన్నాను, ఇప్పుడు ఎవరినీ కలవలేనని చెప్పాను" అని తెలిపారు. వారిలో నల్ల బట్టలు ధరించిన ఒక వ్యక్తి, 'రామరాజ్యం కోసం పనిచేసే వారిని కలవడానికి మీకు సమయం లేదా?' అంటూ 'టేక్ హిమ్ కస్టడీ' అని అన్నట్లు రంగరాజన్ గుర్తుచేసుకున్నారు. ఆ వ్యక్తి మాటలు విని ఎవరో పెద్ద అధికారి అయి ఉంటారని తాను భావించినట్లు చెప్పారు.

 

ఇది కూడా చదవండి: షాకింగ్ న్యూస్! పహల్గాం ఉగ్రవాదుల చెరలో బీజేపీ నేత కూతురు! తర్వాత ఏం జరిగింది?

 

అనంతరం, సుమారు 20 మంది వ్యక్తులు ఒక్కసారిగా తలుపులు తోసుకుని ఇంట్లోకి ప్రవేశించారని రంగరాజన్ ఆరోపించారు. "వారు నన్ను కాళ్లు పట్టి లాగి కిందపడేసి దాడి చేశారు. ఈ ఘటనతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను" అని ఆయన వివరించారు. ఈ దాడిని తేలిగ్గా తీసుకునేది లేదని, దీనిపై కచ్చితంగా న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. దాడికి పాల్పడిన వారిపై సివిల్, క్రిమినల్ పరువు నష్టం దావాలు వేస్తామని తెలిపారు. ఈ దాడి వెనుక ఆలయానికి సంబంధించిన కోర్టు వివాదమే కారణమని రంగరాజన్ అనుమానం వ్యక్తం చేశారు. "ఆలయానికి సంబంధించిన విషయం కోర్టు పరిధిలో ఉంది. ఈ దాడి వెనుక ఎంత పెద్దవారు ఉన్నా సరే, శిఖండిలా తెర వెనుక ఉండి వ్యవహరించవద్దు" అని ఆయన వ్యాఖ్యానించారు. తమపై ఆరోపణలు చేసేవారు కోర్టులో వాదనలు వినిపించి, తాము తప్పు చేయలేదని నిరూపించుకోవాలని రంగరాజన్ సవాలు విసిరారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్ట్ లిస్ట్ రెడీ! కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఎప్పుడంటే?

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీకి షాక్.. లిక్కర్ స్కామ్ కేసులో కీలక మలుపు.. సజ్జల శ్రీధర్ రెడ్డికి రిమాండ్!

 

వివేకా కేసులో బిగ్ ట్విస్ట్.. రంగన్న భార్యకు సిట్ నోటీసులు.. ఈ వరుస మరణాల వెనుక.!

 

మరో పదవిని కైవసం చేసుకున్న కూటమి ప్రభుత్వం! 74 మంది మద్దతుతో..

 

ఏపీలోని కూటమి ప్ర‌భుత్వానికి కేంద్ర గుడ్‌న్యూస్.. ఆ నిధుల‌ విడుద‌ల!

 

వైసీపీ నేతకు దిమ్మదిరిగే షాక్! అప్పుల భారం - ఆస్తులు వేలం!

 

ఢిల్లీలో జరిగిన గంటల చర్చలు.. కీలక నిర్ణయాలు ! వాటికి ఓకే చెప్పిన మోదీ!

 

దెబ్బకు ఠా దొంగల ముఠా! లిక్కర్ కేసులో మరో నిందితుడు అరెస్ట్!

 

టీటీడీ కీలక నిర్ణయం! ఇకనుండి భక్తులకు అవి ఉచితం! ప్రవాసాంధ్రులకు కూడా భాగస్వామ్యం!

 

నేడు (26/4) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

సీఎంలకు హోం మంత్రి అమిత్ షా ఫొన్.. 48 గంటల లోపు.. ఎందుకంటే.!

 

మహిళలకు ప్రభుత్వం శుభవార్త.. 2-3 రోజుల్లో అకౌంట్లలోకి డబ్బులు.! వారికి ఇక పండగే పండగ..

 

సస్పెండ్ విషయంలో దువ్వాడ కీలక వ్యాఖ్యలు! తాను ఎప్పుడూ పార్టీకి..

 

మరోసారి బరితెగించిన వైసీపీ మూకలు..! ఏం చేశారంటే..!

 

వైసీపీ గుట్టు రట్టు! సెక్షన్లకే షాక్ ఇస్తున్న సునీల్ కుమార్ కేసులు!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Chandrababu #AndhraPradesh #APpolitics #APNews #Celebrations